Site icon NTV Telugu

అక్కడ ‘గీత’, ఇక్కడ ‘గోవింద్’… నంబర్ వన్ పొజీషన్ లో ‘డిజాయరబుల్ కామ్రేడ్స్’!

Rashmika Mandanna and Vijay Devarakonda in Time Most Desirable List

రశ్మిక అందం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలా? ఆమె కెరీర్ మొదలైనప్పటి నుంచీ పెద్ద సెన్సేషనే! శాండల్ వుడ్ లో రశ్మికని అప్పట్లో కర్ణాటక క్రష్ అనేవారు. ఇక ఇప్పుడు ‘మిషన్ మజ్నూ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తొలి చిత్రం విడుదలకి ముందే రశ్మికని నేషనల్ క్రష్ అంటోంది బీ-టౌన్ మీడియా. ఇక తెలుగులో ‘భీష్మ’ బ్యూటీ ‘సరిలేరు నాకెవ్వరూ’ అంటూ దూసుకుపోతోన్న సంగతి మనకు తెలిసిందే!

తన చిలిపి వయ్యారంతో మాయ చేసే బెంగుళూరు చిన్నది మరోసారి ‘మోస్ట్ డిజాయరబుల్’గా నిలిచింది కన్నడ రాష్ట్రంలో. ఆమె టైమ్స్ సంస్థ ప్రకటించిన ‘మోస్ట్ డిజాయరబుల్ ఉమెన్’ లిస్టులో ఫస్ట్ ప్లేస్ సాధించింది. బెంగుళూరు జనం రశ్మికనే మరోసారి మోస్ట్ డిజాయరబుల్ బ్యూటీగా ఎన్నుకున్నారు. 2019లోనూ మిస్ మందణ్ణా నంబర్ వన్ గా నిలిచింది.

‘మోస్ట్ డిజాయరబుల్ ఉమన్’గా ఎంపికైన రశ్మిక సొషల్ మీడియాలో తన ఆనందం పంచుకుంది. సర్ ప్రైజ్ అంటూనే లవ్ యూ బెంగుళూరు అంటూ హోమ్ టౌన్ కి థాంక్స్ చెప్పింది. కరోనా లాక్ డౌన్ కండీషన్ చక్కబడ్డాక సెలబ్రేట్ చేసుకుందాం అని కూడా రశ్మిక చెప్పింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, బెంగుళూరు మోస్ట్ డిజాయరబుల్ ఉమన్ గా రశ్మిక నంబర్ వన్ గా నిలిస్తే… ఆమె ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ కోస్టార్ విజయ్ దేవరకొండ హైద్రాబాద్ లిస్ట్ లో టాప్ ప్లేస్ స్వంతం చేసుకున్నాడు. ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్- హైద్రాబాద్’లో ఆయనదే అగ్రస్థానం!

Exit mobile version