Site icon NTV Telugu

Rashmika Mandanna: మంచి ఊపుమీదున్న రష్మిక

Rashmika Mandanna Acciden

Rashmika Mandanna Acciden

కన్నడ భామ రష్మిక మందన కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ పిలుపు అందుకుని ఇప్పుడు అక్కడికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. నిజానికి యానిమల్ సినిమాతో హిందీలో కూడా సక్సెస్ అందుకున్న ఆమె ఆ తర్వాత ఏ ఒక్క సినిమాతోనో ప్రేక్షకులను పలకరించలేదు. నిజానికి ఆమె చేస్తున్న సినిమాలన్నీ వాయిదాల పడుతూ వస్తున్న నేపథ్యంలో ఆమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

Nag Ashwin: బాలీవుడ్ భామతో పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా!!

10 నెలల వ్యవధిలో ఆమె నటించే ఆరు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా వచ్చేనెల 5వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత చావా అనే బాలీవుడ్ సినిమాలో కూడా విక్కీ కౌశల్ సరసన ఆమె నటించింది. ఈ సినిమా కూడా సంక్రాంతి సమయంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ ఈద్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. అలాగే ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్న కుబేర అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే స్త్రీ 2 మేకర్స్ చేస్తున్న తామ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కాకుండా రెయిన్బో అనే సినిమా కూడా ఆమె లైనప్ లో ఒక సినిమాగా ఉంది. దాదాపుగా ఈ సినిమాలన్నీ 10 నెలల వ్యవధిలో రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version