Site icon NTV Telugu

Rashmi : భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!

Rashmi

Rashmi

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్‌ అయ్యింది రష్మి గౌతమ్‌. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్‌మెంట్‌తో అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న భారత్-పాక్ యుద్ధం యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్ చేసింది.

Also Read : Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది భారత్. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే తో పాటు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత్ వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య యుద్ధ పరిస్థితులపై ఇప్పటికే చాలా మంది నటినటులు.. వ్యాపారవేత్తలు రియాక్ట్ అవుతూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బుల్లితెర యాంకర్ రష్మి కూడా ఈ యుద్ధంపై వైరల్ కామెంట్స్ చేసింది. ‘మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నాం.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. దేశ భక్తి అనేది ఆప్షన్ కాదు.. ఈ రోజు చేశాం.. రేపు చేయనక్కర్లేదు అనడానికి. పహల్గామ్ ఎటాక్ తర్వాత సోదరభావం లేదు.. ఉండక్కర్లేదు కానీ భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుక కోసేయండి. ఈ గడ్డమీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి . దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయండి’ అని రష్మీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఇక రష్మి ట్వీట్‌కి ఒక్కోక్కరు ఒక్కోలా రియక్ట్ అవుతున్నారు.

Exit mobile version