తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అగ్ర కథానాయికగా రాణించిన నటి రాశి, ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించారు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన రాశి నటించిన సినిమాలు ఘన విజయం సాధించాయి. హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఆమె, కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.
Also Read : Coolie : రజినీ ‘కూలీ’ సినిమాలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ..?
తాజాగా ఆమె నటించిన చిత్రం ‘ఉసురే’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రాశి, తన కమ్‌బ్యాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘గతంలో నా గురించి కొన్ని అపోహలు పుట్టుకొచ్చాయి.. ‘రాశి సినిమాల్లో చేయడం మానేసిందట’ అంటూ.. అలా మాట్లాడే వారిని చూసి ఆశ్చర్యపోయా. నిజం చెప్పాలంటే, నాకు కథలంటే ఇప్పటికీ ప్రేమ. నేను కథ బలంగా ఉంటే ఎలాంటి పాత్రకైనా సిద్ధం. కానీ కొందరు నిర్మాతలు, దర్శకులు ‘మీరు సినిమాలు మానేశారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ కొన్ని సినిమాలు చేస్తున్నా, మంచి పాత్రలు వస్తున్నాయి’ అని ఆమె చెప్పారు. ముందుగా టీవీ సీరియల్స్‌లో ముఖ్య పాత్రలు పోషించన ఆమె.. తిరిగి సినిమాల్లో మళ్లీ పూర్తి స్థాయిలో కనిపిస్తుండటం తో సినీ అభిమానుల్లో ఆనందం నెలకొంది. కమ్‌బ్యాక్ చేస్తున్న రాశికి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం!
