Site icon NTV Telugu

Rashi Khanna : టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌లోకి రాశీఖన్నా..

Rashi Kanna

Rashi Kanna

తన కెరీర్ కు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చి పెట్టిన టాలీవుడ్‌కు కాస్తంతా ధూరంగా ఉంటుంది రాశీ ఖన్నా. ప్రజంట్ తన ఫోకస్ మొత్తం తమిళ్, హిందీ ఇండస్ట్రీల పైనే పెట్టి.. వరుస సినిమాలు సీరిస్‌లతో అదరడగొడుతుంది. మొత్తనికి దాదాపు టు ఇయర్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశీ. చై కి జోడిగా ‘థాంక్యూ’ తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ ‘తెలుసుకదా’. జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ, రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అక్టోబర్ 17న ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో రాశీ ఖన్నా తో పాటుగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read : Kollywood : నయా ట్రెండ్ సెట్ చేస్తున్న కోలీవుడ్..

అయితే సౌత్‌లో లీడ్ యాక్టర్‌కు తక్కువ.. సెకండ్ హీరోయిన్‌కు ఎక్కువగా క్యారెక్టర్స్ వస్తున్న నేపథ్యంలో, బాలీవుడ్‌పై ఫోకస్ చేసిన రాశీ‌ ఖన్నాకు అక్కడ అదే సిచ్యుయేషన్. దీంతో ‘తెలుసుకదా’ లో తన క్యారెక్టర్‌కు, వెయిట్ ఎక్కువ ఉండటంతో తృప్తి పడింది ఈ ముద్దుగుమ్మ. అందులోనూ బీ టౌన్ కాబట్టి సరిపెట్టుకుంటుంది. ప్రజెంట్ బాలీవుడ్‌లో ‘తలకోన్ మే ఏక్’, ‘ఫర్జీ2’ చేస్తోంది. ‘సబర్మతి ఎక్స్ ప్రెస్’ హీరో విక్రాంత్ మాస్సేతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇక టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌ను పలకరిస్తున్న రాశీ ఖన్నా.. మళ్లీ తెలుగులో బిజీ గా మారుతుందా..? లేక బాలీవుడ్‌లోనే ఉండిపోతుందా..? చూడాలి..

Exit mobile version