NTV Telugu Site icon

ఆకాశంలో అద్భుతం… వీడియో షేర్ చేసిన మెగాస్టార్

Rare 22 Degree Sun Halo Video Shared by Chiranjeevi

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో అరుదైన ఖగోళ దృశ్యం హైదరాబాదీలను ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యుడి చుట్టూ ఎప్పుడూ చూడని విధంగా ఇంద్రధనస్సు రంగులో ఓ వృత్తాకారం ఏర్పడింది. ఒక గంటకు పైగా కనువిందు చేసిన ఈ అద్భుతాన్ని చాలామంది తమ ఫోన్లలో బంధించడానికిట్రై చేశారు. చాలా మంది హైదెరాబాదీలు ఈ అద్భుతమైన చిత్రాన్ని నేడు తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. 22 డిగ్రీల వృత్తాకార హాలో అని పిలువబడే ఈ దృగ్విషయం… సూర్యుడికి, చంద్రుడికి సంభవిస్తుంది. సిరస్ మేఘాలలో ఉన్న షట్కోణ మంచు స్ఫటికాలపై కిరణాలు రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. దీనిని కాలిడోస్కోపిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. చంద్రుని చుట్టూ హాలో సంభవించినప్పుడు దానిని మూన్ రింగ్ లేదా వింటర్ రింగ్ అంటారు. సాధారణంగా,నీటి ఆవిరి భూమి ఉపరితలం నుండి 5-10 కిలోమీటర్ల ఎత్తులో మంచు స్ఫటికాలలో గడ్డకట్టినప్పుడు సిరస్ మేఘాలు ఏర్పడతాయి. ఇక తాజాగా ఈ అద్భుతమైన వీడియోను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.