Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్‌గా బాలీవుడ్ హీరో ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్‌లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది.
సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ ఫుల్ యాంటాగొనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్, రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. ఈ క్యారెక్టర్‌కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీయస్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!