NTV Telugu Site icon

RAPO22 : గ్రాండ్ గా రామ్ పోతినేని – మహేశ్ సినిమా లాంఛ్

Rapo22

Rapo22

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నవీన్  పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన  మహేష్ బాబు. పి  దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా  హీరోగా రామ్ కెరీర్ లో  22వ సినిమా.

Also Read : SaiDurghaTej : మావయ్య నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయిదుర్గ తేజ్!

నేడు మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని పుట్టిన రోజు సందర్భంగా రామ్ సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో యుంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, స్టార్ దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి తో పాటు పవన్ సాధినేని, శివ నిర్వాణ పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు హనురాఘవపూడి క్లాప్ నివ్వగా మరొక దర్శకులు గోపిచంద్ మలినేని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫిక్స్ చేసారు. రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది. వాళ్ళిద్దరి పెయిర్, సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతాయని యూనిట్ అంటోంది. సున్నితమైన వినోదంతో పాటు  మనసును హత్తుకునే కథాంశంతో  యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించనున్నాడు దర్శకుడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ గా తమిళ ద్వయం వివేక్ శివ, మెర్విన్ సోలొమన్ ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Show comments