Site icon NTV Telugu

RAPO 22 : ‘ఉపేంద్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్

Rapo22

Rapo22

ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. త్వరలోనే అధికారక ప్రకటన కూడా రానుంది.

Also Read : Tollywood : చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది : వల్లభనేని అనిల్ కుమార్

కాగా ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ కనిపించనున్నాడు. తాజాగా ఉపెంద్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అందని వాడు మన అందరి వాడు సూర్య కుమార్ అని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉపేంద్ర క్యారక్టర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ బలంగా నమ్ముతోంది. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను రామ్ బర్త్ డే కానుకగా ఈ నెల 15న రిలీజ్ చేయనున్నారు. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళ ద్వయం వివేక్ శివ, మెర్విన్ సోలొమన్ మ్యూజిక్ అందిస్తుండగా చిత్ర హీరో రామ్ స్వయంగా ఓ సాంగ్ ను రచించాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను సెప్టెంబరు 2న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Exit mobile version