NTV Telugu Site icon

Jani Master :జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు

Jani Master Mahila Comission

Jani Master Mahila Comission

Rape Victim Complained to Women Comission on Jani Master : జానీ మాస్టర్ మీద నమోదైన రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. జానీ మాస్టర్ మీద మహిళా కమిషన్ కి కూడా సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 2017లో జానీ మాస్టర్ కు పరిచయమైన సదరు లేడీ కొరియోగ్రాఫర్ 2019లో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయింది.

Jani Master: రేప్ ఆరోపణల కొరియోగ్రాఫర్ హీరోయిన్ గా జానీ మాస్టర్ సినిమా.. ఏమిటో తెలుసా?

ఒకసారి ముంబైలో సినిమా షూటింగ్ ఉందని చెప్పి ఇద్దరు మగ అసిస్టెంట్లతో కలిసి జానీ మాస్టర్ ఆమెను తీసుకుని ముంబై వెళ్లారు. ముంబై వెళ్ళిన తర్వాత హోటల్ లో రూమ్ తీసుకుని తన మీద అత్యాచారం చేశారని సదరు యువతి ఆరోపిస్తోంది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఎవరికైనా చెబితే అసలు సినిమా పరిశ్రమలో లేకుండా చేస్తానని అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు ఆమె ఆరోపిస్తోంది. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తన మణికొండ ఫ్లాట్లో అనేకసార్లు బలవంతం చేశాడని, తాను ఎంత లొంగకపోయినా లొంగదీసుకునే ప్రయత్నం చేసేవాడని ఆమె అంటుంది. అంతేకాదు మతం మార్చుకోమని భయపెట్టేవాడని, బెదిరించేవాడని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలనివెళ్లిందని సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపిస్తోంది.

Show comments