Site icon NTV Telugu

Aman Singh: పెళ్లి చేసుకుంటానని రేప్.. టాలీవుడ్ నటుడిపై కేసు

Rape Case On Actor Aman Singh

Rape Case On Actor Aman Singh

Rape and Cheating Case Filed on Aman Singh: హైదరాబాద్ కు చెందిన నటుడు అమన్ సింగ్ పై రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాదు బేగంపేట ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ లో పరిచయమైన తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుసార్లు అత్యాచారం చేసినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తోంది.

Union Minister Murugan: ఢిల్లీలో జగన్‌ ధర్నాపై కేంద్రమంత్రి సంచనల వ్యాఖ్యలు..

అంతేకాదు తనతో పర్సనల్గా ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు తీసి అమన్ సింగ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదుని సీరియస్గా తీసుకున్న పోలీసులు తెలుగు నటుడు అమన్ సింగ్ మీద రేప్ కేస్ తో పాటు చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. అమన్ సింగ్ ప్రస్తుతానికి ఏ సినిమాలు చేశాడనే విషయం మీద క్లారిటీ లేదు. అతడు వర్ధమాన నటుడు అనే ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

Exit mobile version