NTV Telugu Site icon

RaoRamesh : మారుతి నగర్ కు మంచి లాభాలు.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా..?

Untitled Design (7)

Untitled Design (7)

రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది.  అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

Also Read : 35Movie : టాలీవుడ్ టాప్ హీరో మెచ్చిన సినిమా ’35 చిన్న కథ కాదు’: నిర్మాత సృజన్

సుకుమార్ సతీమణి తబిత తొలిసారిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సమర్పకురాలిగా వ్యవహరించింది. కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేసింది. విడుదలకు ఒక ఒక రోజు ముందుగా ప్రిమియార్స్ ప్రదర్శించగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 23న రిలీజైన ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.0 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అటు ఓవర్సీస్ లోను ఇప్పటివరకు ఈ చిత్రం $100K గ్రాస్ రాబట్టింది. థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆగస్టు 23న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికి ఇంకా థియేటర్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.

Show comments