రణవీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ధురంధర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్టోరీని ఇన్ స్పైర్ గా తీసుకుని ఉరి ఫేం ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణవీర్ లుక్ దగ్గర నుండి యాక్షన్ సీన్స్, బీజీఎం వరకు మంచి అప్లాజ్ దక్కింది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోయిన్‌గా మారిన సారా అర్జున్ అసలు రణవీర్‌తో రొమాన్స్ ఎలా చేస్తుంది అని ఒకటే రచ్చ.
Also Read : Exclusive : టాలీవుడ్ ఫ్లాపుల వీరులు.. ఎవరెవరు ఎన్నేన్ని డిజాస్టర్స్ కొట్టారంటే
వివరాలలోకెళితే రణవీర్ కు 40 ఇయర్స్ కాగా, సారాకు 20 ఇయర్స్. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 20 ఇయర్స్ ఉండటాన్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. వీళ్లద్దరి పెయిర్ కూడా మ్యాచ్ కాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లతో రొమాన్స్ ఏంటి కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ స్టార్ హీరోతో రొమాన్స్ సీన్లలో కనిపించేసరికి నెటిజన్స్ రణవీర్ ను ట్రోల్ల్స్ చేస్తున్నారు. ముంబయికి చెందిన సారా ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ డాటర్. ఆరేళ్లకే మొహానికి మేకప్ వేసుకున్న ఈ యంగ్ బ్యూటీ విక్రమ్ దేవియ తిరుమగళ్‌తో పాపులరయ్యింది. దీని డబ్బింగ్ వర్షన్ నాన్నతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువయ్యింది. తెలుగులో దాగుడు మూతల దండాకోర్‌లో బంగారంగా కనిపించి టీనేజ్‌కు వచ్చాక సపోర్టింగ్ రోల్స్ చేసింది. పొన్నియన్ సెల్వంలో కూడా ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది. ఇటీవల తగ్ లైఫ్ లో అభిరామితో కమల్ హాసన్ కిస్ సీన్స్ పట్ల ఇలాంటి ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు రణవీర్ పై కూడా ఇదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది.
