Site icon NTV Telugu

Ranveer Singh : అభిమాని పట్ల.. రణ్‌వీర్ సింగ్ చేసిన పనికి షాక్ అయిన నెటిజన్లు!

Ranveer Sing

Ranveer Sing

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మరోసారి తన గొప్ప మనసుతో వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీలు అభిమానులను కలిసినప్పటికీ, వారిని గౌరవించే సందర్భాలు చాలా అరుదు. అయితే రణ్‌వీర్ మాత్రం ఆ మధ్య ముంబయిలో జరిగిన ఓ ఘటనలో తన సున్నితమైన ప్రవర్తనతో జనాల మనసులు గెలుచుకున్నారు.

Also Read : TG Vishwa Prasad : టాలీవుడ్‌ మూవీస్ బడ్జెట్ పై మ‌ల‌యాళం నిర్మాత షాకింగ్ కామెంట్స్..

రీసెంట్‌గా రణ్‌వీర్ సింగ్ ముంబయిలోని ఓ డబ్బింగ్ స్టూడియోకు వచ్చారు. డబ్బింగ్ ముగించుకుని బయటకు రాగానే ఆయన కోసం ఎదురుచూస్తున్న ఓ పెద్దావిడను గమనించారు. ఆమె తనకు అభిమానిగా ఉన్న విషయం తెలిసిన వెంటనే, రణ్‌వీర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె పాదాలకు నమస్కారం పెట్టారు. అంతటితో ఆగకుండా కాసేపు ఆ పెద్దవిడ‌తో మాట్లాడారు, ఆప్యాయంగా పరామర్శించారు. ఈ ఘటనను అక్కడున్న వ్యక్తులు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ‘ఈ రోజుల్లో ఇలాంటి వినయం చాలా అరుదు’, ‘స్టార్‌డమ్ ఉన్నా రణ్‌వీర్ నిజంగా గ్రేట్’, ‘పెద్దల పట్ల గౌరవం చూపడం అతని నిజమైన గొప్పతనం’ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ఫీడ్‌ను నింపేస్తున్నారు.

ఇక ప్రస్తుతం రణ్‌వీర్ ‘ధురంధర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన ఓ అండర్‌కవర్ స్పై పాత్రలో కనిపించనున్నారు. పాకిస్థాన్‌లో భారతదేశం కోసం రహస్యంగా పని చేసే ఏజెంట్‌గా ఆయన పాత్ర రూపుదిద్దుకుంటోంది. ఇటీవలే విడుదలైన టీజర్‌లో ఆయన గెటప్, మేకోవర్ అభిమానులను ఆకట్టుకుంది. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో గన్ పట్టుకుని కనిపించిన రణ్‌వీర్ లుక్ వైరల్ అయ్యింది.

Exit mobile version