బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన నటనతో నార్త్ ఇండియాలోనే కాక, సౌత్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ వంటి సినిమాల తర్వాత ఆయనకు అన్ని భాషలలోనూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ‘యానిమల్’తో వచ్చిన హైప్‌కి ఫలితంగా ఆయనకు భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆయన తాజాగా నటిస్తున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ఈ క్రేజ్‌ను మరింత పెంచింది.
Also Read : Rashmika : వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..
బాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రూ.1600 కోట్ల బడ్జెట్‌తో ఈ ‘రామాయణ’ చిత్రం రూపొందుతోంది. దీనికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్‌పై నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో..రణబీర్ కపూర్ – రాముడి పాత్రలో,సాయి పల్లవి – సీత పాత్రలో,యష్ – రావణుడి గా నటించడంతో పాటుగా.. ఈ మూవీకి కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యావహరిస్తున్నారు. ఇంకా అనేక స్టార్ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే సమాచారం ప్రకారం ఈ సినిమాకు రణబీర్ కపూర్ రూ. 65 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ.. ఈ స్థాయి భారీ బడ్జెట్ సినిమాలో, ముఖ్యమైన పాత్రలో కనిపించబోయే ఆయనకు రూ.100 కోట్లను కూడా ఇవ్వొచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
