Nara Lokesh Praises Ranabali Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. రణబాలి ట్రైలర్‌ను వీక్షించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
1800ల నాటి రాయలసీమ వాతావరణాన్ని, బ్రిటిష్ పాలనలో కరువు, అణచివేతతో ప్రజలు ఎదుర్కొన్న హృదయవిదారక పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ‘రణబాలి ట్రైలర్ ఇప్పుడే చూశాను. వావ్.. చాలా బాగుంది. అద్భుతమైన అనుభూతి కలిగింది. 1800ల నాటి రాయలసీమ వాతావరణాన్ని.. బ్రిటిష్ పాలనలో కరువు, అణచివేతతో ప్రజలు ఎదుర్కొన్న హృదయవిదారక పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఎంతో సహజంగా, శక్తివంతంగా కనిపిస్తున్నారు. రాయలసీమ నేలతో మమేకమైన నటనతో విజయ్ ఆకట్టుకున్నారు. రష్మిక మందన్న తన పాత్రకు అద్భుతంగా ప్రాణం పోశారు’ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు.
‘చరిత్రలోని అంతగా వెలుగులోకి రాని ఓ శక్తివంతమైన ఘట్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో పాటు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. అక్టోబర్ 16న మీ అందరికీ గొప్ప విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై ఆసక్తి బజ్ పెరిగింది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ హయాంలో సాగే వాస్తవ చారిత్రక అంశాల ఆధారంగా డైరెక్టర్ ఈ కథను మలిచారు. పన్నుల దోపిడీ, ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజల తరఫున ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన యోధుడు ‘శింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ నటన అద్భుతంగా ఉంది. రణబాలి మూవీ విజయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
Just saw the trailer of #Ranabali and wow, what an immersive experience! The detailing in recreating 1800s Rayalaseema and capturing that heart-wrenching era of British-era famine and oppression is phenomenal.
@TheDeverakonda looks effortlessly fierce and completely at home in the soil of Seema, brilliantly anchored by @iamRashmika. Kudos to @Rahul_Sankrityn and the entire team for bringing such a powerful, untold chapter of history to life. Wishing you all huge success on October 16!
https://t.co/lHlmpxca8u
— Lokesh Nara (@naralokesh) October 10, 2026

