‘రానా నాయిడు’ వెబ్ సిరీస్ అంత చేసి ఉంటారు. విపరీతమైన అడల్ట్ సీన్స్ తో బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా వెంకీ మామతో నాయుడు అంటూ ఊహించని విదంగా బూతులు చెప్పించారు. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయనకు ఉండే ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అలాంటి హీరో నోటి నుండి బూతులు రావడం అభిమానులు తట్టుకోలేక పొయ్యారు. వెంకీ మామని మూవీ టీం ను చాలా విమర్శించారు. అందుకే టాక్ తోనే ఈ వెబ్ సిరీస్‌ను మన తెలుగు వాళ్లు చాలా మంది చూడలేదు. కానీ నెట్ ఫ్లిక్స్‌లో మాత్రం మిగతా అన్ని చోట్లా ఆ సిరీస్ క్లిక్ అయింది. ఇప్పుడు ‘రానా నాయుడు 2’ కూడా రెడీ అయింది.
Also Read : Jhanvi : కేన్స్‌లో అమ్మ జ్ఞాపకాలు నన్ను బాగా వెంటాడుతున్నాయి..
జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్‌లోకి ‘రానా నాయుడు 2’ స్ట్రీమింగ్‌కి రాబోతోంది. తాజాగా టీజర్ కూడా వదిలారు. వారు చెప్పినట్లుగానే ఎలాంటి చెడు మాటలు, అడల్ట్ సీన్స్ అయితే కనిపించలేదు. సిరీస్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇక ఈ రెండో సీజన్ ప్రమోషన్స్‌ను టీం అప్పుడే ప్రారంభించింది. ఇందులో భాగంగా రానా మాట్లాడుతూ.. ‘మొదటి సీజన్‌లో మాదిరిగా ఇందులో బూతులు లేవు. చాలా వరకు తగ్గించాము. ప్రపంచమంతా కూడా ఈ రానా నాయుడుని చూసింది. కానీ తెలుగు వాళ్ళు మాత్రం అంతగా చూడలేదు. దానికి అడల్ట్ డైలాగ్‌లే కారణమని తెలిసింది. అందుకే ఈ సారి చాలా వరకు వాటిని తగ్గించాం. వయలెన్స్‌ను పెంచాం’ అని తెలిపాడు. మరి మాట ప్రకారం రెండో సీజన్‌ను తెలుగు ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
