Site icon NTV Telugu

సూపర్ హీరోగా మారబోతున్న దగ్గుబాటి స్టార్

Rana Daggubati to act in Super Hero film

‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇండియాలో ‘బాహుబలి’ అలాగే అమెరికాలో ‘స్టార్ వార్స్” అని అన్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్”లో ఓ పాత్రకు తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.

Read Also : “గని”తో ఐకాన్ స్టార్… విషయం ఏంటంటే ?

ఈ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా సూపర్ యాక్షన్ హీరో చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు. అందులో తన పాత్ర, స్క్రిప్ట్, తారాగణం, సిబ్బంది గురించి, టైటిల్ లాంటి ఇతర వివరాలు వెల్లడించలేదు. కానీ త్వరలో సూపర్ హీరో చిత్రంలో కనిపించనున్నట్లు మాత్రం ధృవీకరించారు. దీంతో రానా నటించబోయే సూపర్ హీరో మూవీ ఏమై ఉంటుందా ? అని ఆలోచనలో పడ్డారు ఆయన అభిమానులు. రానా దగ్గుబాటి చివరిసారిగా “అరణ్య”లో ప్రధాన పాత్రలో కన్పించారు. ప్రస్తుతం ఆయన సాగర్ కె చంద్ర దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న “అయ్యప్పనమ్ కోషియం” తెలుగు రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

Exit mobile version