Site icon NTV Telugu

“బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!

Bigg Boss Telugu Season 5 to Start on August

పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5” తెలుగు హోస్ట్‌గా తాను చేయట్లేదని రానా స్పష్టం చేశారు. సినిమాలు, ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలోని సిరీస్ లలో కన్పించడమే సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇన్ని రోజులుగా “బిగ్ బాస్-5″కు రానా హోస్ట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

Read Also : ఇష్క్ : “చీకటి చిరు జ్వాలై” లిరికల్ వీడియో సాంగ్

రానా దగ్గుబాటి తదుపరి చిత్రం ‘విరాటా పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణితో కలిసి కనిపించనున్నారు.రానా… పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీలో కూడా భాగం కానున్నాడు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “అయ్యప్పనమ్ కోషియం” అధికారిక రీమేక్. మరోవైపు జూలైలోనే బిగ్ బాస్ షో ప్రసారం కావాల్సి ఉంది. కానీ కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి ఉండాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఆగష్టులో ఈ షోను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

Exit mobile version