ఇష్క్ : “చీకటి చిరు జ్వాలై” లిరికల్ వీడియో సాంగ్

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా, శ్యామ్ కె నాయుడు సినిటోగ్రాఫర్ గా చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు. కానీ కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.

Read Also : స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్..!!

జూలై 30న సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి “చీకటి చిరు జ్వాలై” అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. మీరు కూడా “చీకటి చిరు జ్వాలై” లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-