Site icon NTV Telugu

Rampothineni : హ్యాట్రిక్ కొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్.. ఫ్లాప్ దర్శకుడితో రెడీ

Untitled Design 2024 08 18t140400.379

Untitled Design 2024 08 18t140400.379

ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హ్యాట్రిక్ కొట్టేసాడు. అయితే అది హిట్లు కొట్టడంలో కాదులెండి. ఫ్లాప్స్ లో మాత్రమే. అవును మనోడు ముచ్చటగా మూడు ఫ్లాప్ లు కొట్టేసాడు. వారియర్, స్కంద లేటెస్ట్ రిలీజ్ డబుల్ ఇస్మార్ట్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ సాధించాడు. మాస్ చిత్రాల మోజులో తన స్ట్రాంగ్ జోన్ వదిలేసి పరాజయాల బాట పట్టాడు రామ్ పోతినేని. రామ్ లాస్ట్ మూడు సినిమాలు వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ అయ్యాయి.

Also Read: Naga Chaitanya: మెగా, అల్లు దెబ్బకు అక్కినేని ‘తండేల్’ కు తలనొప్పి..

ఒకసారి రామ్ ఫ్లాప్స్ గమనిస్తే ముందుగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన వారియర్. దాదాపు ఓ ఆరు ఏడూ ఏళ్ల క్రితం బన్నీ హీరోగా రావాల్సిన సినిమాను రామ్ తో తెరకెక్కించి దారుణమైన ఫ్లాప్ ఇచ్చాడు లింగుస్వామి. అసలు ఈ దర్శకుడితో సినిమా ఎలా చేసాడో రామ్ కే తెలియాలి. ఇక రెండవ సినిమా స్కంద. భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఓవర్ మాస్, వయసుకు మించిన పాత్రలో నటించి ఫ్లాప్ తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ రిలీజ్ డబుల్ వారియర్ సంగతి సరేసరి. రిలీజ్ అయిన రెండవ రోజే థియేటర్లు కాళీ అయ్యాయంటే ఎంతటి దారుణమైన డిజాస్టరో అర్ధం చేసుకోవాలి. రామ్ ను ఆడియన్స్ నేను శైలజ, రెడీ, దేవదాస్ వంటి లవర్ బాయ్ రోల్స్ లో చుడాలిఅనుకుంటే ఈ హీరో మాస్ జపం చేస్తూ సూపర్  ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మిస్టర్ బచ్చన్ తో ఫ్రెష్ గా డబుల్ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇప్పటికయిన మేల్కొని పెదనాన్న ‘స్రవంతి రవికిశోర్’ సూచనల ప్రకారం వెళ్తే కెరిర్ బాగుంటుంది, లేదంటే ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్ అనే బిరుదు తీసుకోవాల్సి వస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు

Exit mobile version