NTV Telugu Site icon

Ram Charan: కొత్త కారు కొన్న చరణ్.. ఇండియాలోనే రెండోది.. ఆ ధరతో ఎన్ని ఫ్లాట్లు కొనచ్చో తెలుసా?

Ram Charan New Rolls Royce Car

Ram Charan New Rolls Royce Car

Ram Charan Buys a Rolls Royce Spectra Second Car in India costs around 7.5 Crore: మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆయన నటవారసుడిగా ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కార్లపై అంతే ఇష్టాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు. అది కూడా అల్లాటప్పా కారు కాదండోయ్ దాని రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా ఏడున్నర కోట్లు. ఇక ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువే. రోల్స్ రాయిస్ స్పెక్ట్రాగా పిలువబడే ఈ కారు ఇండియాలో రెండో కారు అని తెలుస్తోంది.

Raj Tarun Case: పవన్ కళ్యాణ్ ఆఫీసుకు రాజ్ తరుణ్ లవర్.. భార్యలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు

చరణ్, ఉపాసన ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో ఈ రోల్స్ రాయిస్ కారులో వెళ్లగా అక్కడి వీడియోలు వైరల్ గా మారాయి. రోల్స్ రాయిస్ కారుని చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రాగా ఉపాసన కూడా ఈ కారులో క్లిన్ కారాతో కలిసి వచ్చింది. నిజానికి రోల్స్ రాయిస్ కంపెనీ ఈ కారుని జనవరిలో రిలీజ్ చేయగా అప్పుడే చరణ్ బుక్ చేయించగా అది ఈ మధ్యనే డెలివరీ అయింది. ఇది దేశంలో రెండవ కారు కాగా హైదరాబాద్ లో ఈ కార్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఇక డబ్బు లెక్కలో చూస్తే రామ్ చరణ్ ఈ కారు కొనడానికి పెట్టిన ఏడున్నర కోట్లతో హైదరాబాదులో ప్రైమ్ లొకేషన్లో రెండు మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేయొచ్చు.