Site icon NTV Telugu

Rambha : వారి కోసమే ఇండస్ట్రీకి దూరం అయ్యా..

Rambha

Rambha

నైంటీస్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన క‌థానాయిక‌ల్లో రంభ ఒక‌రు. అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి అయిన‌ప్పటికి స్క్రీన్ నేమ్‌ను రంభ‌గా మార్చుకుంది. ‘ఆ ఒక్కటి అడ‌క్కు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత ‘బావ‌గారు బాగున్నారా’ తో స‌హా ఎన్నో పెద్ద సినిమాల్లో న‌టించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. త‌మిళంలో సైతం ప‌లు చిత్రాల్లో న‌టించిన రంభ‌.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. చివ‌ర‌గా దేశ‌ముదురులో ఐటెం సాంగ్‌లో క‌నిపించిన రంభ‌.. ఆపై పెళ్లి, పిల్లలు అలా వ్యక్తిగ‌త జీవితంలో సెటిలైపోయింది.

Also Read : Robinhood : అప్పుడే ఓటీటీలోకి ‘రాబిన్‌హుడ్’ మూవీ..

అయితే ప్రజంట్ సీనియర్ హీరోయిన్ లాగే ఆమె కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాల‌నుకుంటోంది. అక్క, వ‌దిన‌, త‌ల్లి త‌ర‌హా పాత్రలు చేయ‌డానికి రంభ రెడీ అవుతున్నట్లుగా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే ఒక టీవీ షోకు జ‌డ్జిగా కూడా వ‌చ్చిన రంభ‌. ఈ నేప‌థ్యంలో త‌న సెకండ్ ఇన్నింగ్స్ గురించి రంభ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది..‘పెళ్లి త‌ర్వాత నేను కెన‌డాలో స్థిర‌ప‌డ్డాను. కుటుంబం, పిల్లల కోస‌మే సినిమాల‌కు దూర‌మ‌య్యాను. నా పిల్లల‌కు ఒక వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లిగా బాధ్యతగా ఎంతైనా ఉంటుంది. ఇక ఇప్పుడు మా బాబుకి ఆరేళ్లు. అమ్మాయిల‌కు 14, 10 ఏళ్లు. ప్రస్తుతం ఎవ‌రి ప‌నులు వాళ్లు చేసుకోగ‌లుగుతున్నారు. నాకు మూవీస్ మీద ఉన్న ఆస‌క్తి గురించి నా భ‌ర్తకు తెలుసు. అందుకే మ‌ళ్లీ న‌టిస్తానంటే ఒప్పుకున్నారు. ముందుగా ఒక డ్యాన్స్ షోకు జ‌డ్జిగా చేశాను. ఎందుకో తెలిదు అప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాను. కానీ షో సాఫీగా సాగిపోయింది. ప్రేక్షకుల చ‌ప్పట్లు నాలో మ‌ళ్లీ ఉత్సాహం నింపాయి. న‌ట‌న నా ర‌క్తంలోనే ఉంది. మ‌ళ్లీ న‌టించ‌డానికి రెడీగా ఉన్నాను. నాతో క‌లిసి న‌టించిన చాలామంది ఇంకా ఇండ‌స్ట్రీలో ఉన్నారు.. నా చేతిలో ప్రజంట్ కొన్ని ఆఫర్ లు కూడా ఉన్నాయి. త్వర‌లోనే నేను న‌టించే సినిమాను ప్రక‌టిస్తా’ అని తెలిపింది రంభ.

Exit mobile version