Site icon NTV Telugu

Ramayana Update: ట్రోల్స్ బలైనా కాజల్.. మండోదరి పాత్ర నుంచి ఔట్ !

Ramayana Update Kajal

Ramayana Update Kajal

బాలీవుడ్ నుండి అత్యంత భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ ‘రామాయణ’. ఈ ప్రాజెక్ట్‌లో యాష్ – రావణాసురుడిగా, రణబీర్ కపూర్ – శ్రీరాముడిగా, సాయి పల్లవి – సీతగా నటిస్తోంది. అయితే ఇందులో రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఇక ఈ ప్రాజెక్ట్‌ నుండి కాజల్ ని తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంపికైందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగింది అంటే..

Also Read : Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – హింసను ఖండించిన నిర్వాహకులు

కాజల్ అగర్వాల్ ‘మండోదరి’ పాత్రలో నటిస్తే, సాయి పల్లవి దగ్గరికి రావణాసురుడైన యాష్ ఎందుకు వెళ్తాడు..? అంటూ సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా కామెంట్స్ వినిపించాయి . అంతే కాదు చాలామంది ఇది రాంగ్ సెలక్షన్ అని.. ఒకటి సాయి పల్లవి ని ఆ క్యారెక్టర్ నుండి మార్చండి, లేదంటే కాజల్ నైనా ఈ సినిమా నుంచి తీసేయండి.. అంటూ చాలా రకాలుగా జనాలు మాట్లాడుతున్నారు . దీంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను రామాయణ ప్రాజెక్టు నుంచి తీసేసారు అన్న టాక్ వైరల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే కాజల్‌ని, మండోదరి పాత్రలో చూస్ చేసుకోక ముందు వరకు చాలా బాగా ఈ సినిమా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేవట.  సాయి పల్లవి పై కూడా మంచి అభిప్రాయం ఉండేదట. కానీ కాజల్‌ని చూస్ చేసుకున్నాకే ఈ తలనొప్పులు స్టార్ట్ అయాయాట. దీంతో ఆమెను తీసేసి మృణాల్ ఠాకూర్ ను చూస్ చేసుకున్నారట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.

Exit mobile version