బాలీవుడ్ నుండి తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట. అయితే సీత పాత్రలో సాయి పల్లవి ని సెలెక్ట్ చేశారు అని తెలిసి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఫైర్ అయిపోయారు. బాలీవుడ్ అసలు హీరోయిన్స్ ఏ లేరా..? ఎందుకు పోయి మలయాళం హీరోయిన్ సాయి పల్లవిని చూస్ చేసుకున్నారు.. అని మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read : Butchi Babu: బుచ్చిబాబకు మాటిచ్చిన మహేశ్ బాబు..!
ఏంటీ అంటే సాయి పల్లవి ఈ ‘రామాయణ’ కోసం ఏకంగా రూ. 13 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట, ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇంత రేంజ్ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండటంతో.. సాయి పల్లవి పై ఓ రేంజ్ లో నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. అంతకుమించిన రేంజ్‌లో పారితోషికం అందుకుటూందని తెలియడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది జనాలు ఏంటి సాయి పల్లవికి అంత సీన్ ఉందా..? అంటూ ఘాటు ఘాటుగా ఆమెను విమర్శిస్తున్నారు. మరి నిజంగానే సాయి పల్లవి అంత డిమాండ్ చేసిందా తెలియాల్సి ఉంది.
