Ramayana Box Office Collections: బాక్సాఫీస్‌ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!

Ramayana Highest 5th Day Collection

Ramayana Highest 5th Day Collection

Highest 5th Day Collections for Ramayana Part 1: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన రామాయణ.. మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐదవ రోజు, పోస్ట్‌ దీపావళి రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అరుదైన ఘనత అందుకుంది.

సోమవారం ఐదో రోజు కూడా రామాయణ బాక్సాఫీస్‌ వద్ద తన జోరును కొనసాగించింది. ఐదో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.126 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వసూళ్లతో ఐదో రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా, అలాగే పోస్ట్‌ దీపావళి రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమా విజయాన్ని అభిమానులతో పంచుకుంది.

రామాయణ: పార్ట్ 1 ఐదో రోజు ఇండియాలో రూ.107.50 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. దీంతో ఐదు రోజుల్లో భారతదేశంలో మొత్తం నెట్‌ కలెక్షన్లు రూ.346.35 కోట్లకు చేరాయి. ఇండియా గ్రాస్‌ వసూళ్లు రూ.413.90 కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. ఐదు రోజుల్లో విదేశాల్లో రూ.250 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇండియా, ఓవర్సీస్‌ కలెక్షన్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.663.90 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఐదు రోజుల్లోనే రూ.663.90 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించడంతో రామాయణ బాక్సాఫీస్‌ కలెక్షన్లపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరనుంది. రానున్న రోజుల్లో రామాయణ మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.