Ramani Kalyanam: “రమణి కళ్యాణం” త్వరలో !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం”. జీవితంలోని సవాళ్లు, ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కలగలిసిన అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నేడు చిత్రబృందం ఈ సినిమా యొక్క అధికారిక **టైటిల్ లుక్‌ను** అత్యంత వైభవంగా లాంచ్ చేసింది. ఈ టైటిల్ లాంచ్ కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి** వంటి ప్రముఖులు “రమణి కళ్యాణం” టైటిల్‌ను లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
“రమణి కళ్యాణం” అనేది కేవలం వినోదం మాత్రమే కాకుండా, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం. ఈ సినిమా జీవితంలోని కష్టాల మధ్య కూడా ప్రేమ ఎంత గొప్పగా నిలబడుతుందో చూపిస్తుంది. సినిమా తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు టైటిల్ లాంచ్‌తో ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అరవింద్ తిరుకోవెల అందించగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా, “కోర్ట్” సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, అలాగే యువరాజ్ తేజ కాండ్రకోట, విజయ్ ఆదిరెడ్డితో కలిసి స్క్రీన్ ప్లేను అందించడం విశేషం.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!