Ramajogayya Sastry : పవన్ కల్యాణ్ కు ఆ స్టార్ లిరిక్ రైటర్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజులలో పోలింగ్ జరగనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.ఆ నియోజకవర్గమే పిఠాపురం నియోజకవర్గం..ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు.గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.అయితే గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా మద్దతు తెలుపలేదు.ఈ సారి టాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు.ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది.గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఈ సారి టీడీపీ,బీజేపీలతో కలిసి పోటీ చేస్తుంది.
అయితే పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది .ఈసారి పవన్ కల్యాణ్ ను పిఠాపురం నియోజక వర్గంలో ఎలాగైనా గెలిపించుకోవాలని టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు మద్దతుగా నిలిచింది..రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ను గెలిపించాల్సిందిగా ఓ వీడియో ను రిలీజ్ చేసారు.పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ మద్దతు తెలపడంతో టాలీవుడ్ ప్రముఖులు వరుసగా తమ మద్దతును తెలుపుతున్నారు.తాజాగా టాలీవుడ్ స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పవన్ కు మద్దతు తెలిపారు..మాలో ఒకడు..మనలో ఒకడు.. మనిషితనానికి ప్రతీక..మంచి ఆలోచనలున్న నేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆ శ్రీపాదవల్లభుడిని ప్రార్థిస్తున్నా..చిత్ర పరిశ్రమలో ఒకడిగా పవన్ కు ఓటేయాల్సిందిగా పిఠాపురం ప్రజలను అర్దిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేసారు .
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!