NTV Telugu Site icon

Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?

Untitled Design (42)

Untitled Design (42)

రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్, పూరి జగన్నాధ్ కలయికలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింతా అంటూ సాగే సాంగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. స్కంద ఫ్లాప్ కావడంతో ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: Tollywood: ‘సూపర్ సిక్స్’ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ

ఒకవైపు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతుండగా మరో ప్రాజెక్ట్ ఓకే చేసాడట ఎనర్జిటిక్‌ స్టార్‌. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు మహేష్. కాగా ఈ దర్శకుడు రెండవ చిత్రంగా రామ్ పోతినేనికి కథ వినిపించాడని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ముల్టీస్టారర్ గా తెరకెక్కబోతుందని నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో  నటిస్తున్నట్టు వార్త వినిపిస్తోంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో హ్యూమర్ టచ్ ఉండేలా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్టు సమాచారం. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ‘గాడ్ అఫ్ మాస్ బాలయ్య’, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ కలిసి నటిస్తే ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంటుందని, ఈ చిత్రం రామ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా మిగులుతుందని రామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు. రామ్ మల్టీ స్టారర్ సినిమాలో నటిచడం కొత్తేమి కాదు గతంలో విక్టరీ వెంకీతో ‘మసాలా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Show comments