Site icon NTV Telugu

Ram Pothineni: రామ్ పోతినేని ఎవరి ‘తాలూకా’నో తెలుసా?

Rampothineni

Rampothineni

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న సినిమాకి నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Srikanth Odela: రెండో సినిమాకే ఇంత తెగింపా.. అంత ధైర్యం ఏంటబ్బా?

ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 15 జరిగే ఈ షూట్ లో కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాతో రామ్ రైటర్ గా మారాడు. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడట. పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇక ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమాకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version