NTV Telugu Site icon

RAM : హరీష్ శంకర్ – రామ్ పోతినేని సినిమా ఉంటుందా.. ఉండదా..?

Untitled Design

Untitled Design

టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా, హీరోకైనా సరే హిట్టే కొలమానం.ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల. పూరి జగన్నాధ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ఇస్తారు తప్ప ఒక్క స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు ఇదే టాక్ వినిపిస్తోంది.

Also Read: Tollywood : టాలీవుడ్ టాప్ -5 బుల్లెట్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే

ఈ ఆగస్టు 15న హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా. మరి ముఖ్యంగా దర్శకత్వం పట్ల ప్రేక్షకులు పెదవివిరిచారు. పాత కాలం నాటి దర్శకత్వ ప్రతిభను హరీష్ శంకర్ కనబరిచాడని, ఈ సినిమా ఫెయిల్యూర్ క హరీష్ కారణమని తేల్చేసారు ఆడియన్స్. దీంతో ఈ దర్శకుడి నెక్ట్స్ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన నెక్ట్స్ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేస్తున్నానని ప్రకటించాడు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ తో రామ్ ఫ్లాప్ అందుకున్నాడు. అసలే భారీ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ తో చేసేందుకు రామ్ రెడీ గా లేదని టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి కలయికలో సినిమా లేనట్టే. అటు రామ్ ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడితో సినిమా వద్దనే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా హరీష్ కథ, కథనాలపై దృష్టిపెడితే హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే నాలుగు సినిమాలు వస్తాయ్ లేదంటే మిడ్ రేంజ్ హీరోలతో ఒకటి అరా సినిమాలు చేసుకుంటూ బండి లాగించడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Show comments