NTV Telugu Site icon

Ram Gopal Varma: సిల్క్ స్మిత ఏఐ వీడియో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..

Untitled Design (27)

Untitled Design (27)

సిల్క్ స్మిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నటి అయినప్పటికీ తన అందంతో, మత్తు కళ్ళతో అని బాషలోను మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తను చేసే స్పెషల్ సాంగ్స్ తో సినిమా హిట్ అయిన హిస్టరీ కూడా ఉంది. అలా కొన్నేళ్ల పాటు సిల్క్ స్మిత తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్నప్పటికీ.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినప్పుడు చూడటానికి నటినటులు ఒక కూడా రాలేదు అని అప్పట్లో టాక్.కానీ ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

ఇదిలా ఇటీవల కాలంలో ఏ ఐ టెక్నాలజీ ద్వారా ,వీడియోలను మార్ఫింగ్ చేయడం. అలాగే డీప్ ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి నేరగాలు ఈ మధ్య ఎక్కువైపోయారు . వారి ఆనందం కోసం డబ్బు కోసం పిచ్చి పిచ్చి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సిల్క్ స్మిత కి సంబంధించిన ఏ ఐ జనరేటర్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో పోస్ట్ చేశాడు.‘నేను ఏమి చేయలేను? సిల్క్ స్మితను ఎప్పుడు మరింత అందంగా చూడలేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వర్మ చెప్పినట్టుగానే ఈ వీడియోలో సిల్క్ స్మిత హాలీవుడ్ , బాలీవుడ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తక్కువ లేదు. ఈ తరం ట్రెండుకు తగ్గట్టు కాస్ట్యూమ్స్ తో వీడియో అద్భుతంగా తీశారు. నెటిజెన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.