Site icon NTV Telugu

ఒకసారి పెళ్లయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా ?

Ram Gopal Varma comments on Sumanth Second marriage

అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న మొత్తం టాలీవుడ్ లో ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు వారి వెడ్డింగ్ కార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. వారి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. ఇదంతా నిన్నటి న్యూస్… కానీ ఈ రోజు కూడా సుమంత్ పెళ్లి వార్త టాలీవుడ్ లో ముఖ్యాంశంగా ట్రెండ్ అవుతోంది. దానికి కారణం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సుమంత్ రెండవ పెళ్లిని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ వరుసగా చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.

Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్ ఇచ్చిన తమన్

“ఒకసారి పెళ్లి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్ ? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ అనుభవించండి. ఒక పెళ్లే నూరేళ్ల పెంట అంటే రెండో పెళ్లేంటయ్యా స్వామి ? నా మాట విని మానెయ్యి… పవిత్ర గారు మీ జీవితం పాడు చేసుకోకండి. తప్పు మీది సుమంత్ ది కాదు. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. ఇక సుమంత్ అక్కినేని ప్రస్తుతం తన “అనగనగా ఒక రౌడీ” అనే చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version