తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం కొతేం కాదు. కానీ ఒకే డేట్‌లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మత్రం టాక్ అప్ ది టాలీవుడ్ గా మారాయి..
Also Read : Pradeep Ranganathan : మళ్లీ డైరెక్టర్‌గా ప్రదీప్ – సైన్స్ కథతో సెట్ పైకి !
ఒక్కరోజు తేడాతో రెండు సినిమాలు క్లాష్ అవ్వనున్నాయి. ఆ మధ్య ‘ది ప్యారడైజ్’ మాత్రం వాయిదా పడుతుంది అని పెద్ది సినిమా సోలో రిలీజ్‌గా వస్తుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు సినిమాల నడుమ క్లాష్ ఆగిపోలేదు. నాని లేటెస్ట్ గా.. సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టినట్టు, ఒక మాసివ్ స్టిల్ తో మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇవ్వడమే కాకుండా, 2026 మార్చ్ 26నే సినిమా వస్తుంది అంటూ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ రెండు సినిమాల క్లాష్ ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పాలి. ఇక పెద్ది సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ‘ది ప్యారడైజ్’ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాల కథలు వేరు, స్క్రీన్ ప్రెజెన్స్ వేరు, అయినా టార్గెట్ మాత్రం సేమ్.. ఆడియన్స్ మనసులు. మెగా ఫ్యాన్స్ vs నాని ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఇప్పటికే వాడివేడిగా చర్చలు మొదలయ్యాయి. ఇక టాలీవుడ్ సమ్మర్ 2026 లో ఎవరిది విజయ గీతం అనేది మరికొన్ని నెలల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం ప్రేక్షకులకు మాత్రం డబుల్ ట్రీట్ ఖచ్చితంగా ఉండబోతోంది.
