NTV Telugu Site icon

GameChanger : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్..?

Gamechanger

Gamechanger

మెగా  ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. కానీ అంతకంటే ముందు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు రెడీ ఉండండని గేమ్ ఛేంజర్ మేకర్స్ చెబుతున్నారు.

Also Read : Sai Pallavi : ఎల్లమ్మగా సాయి పల్లవి..?

ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే.. లక్నోలో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేసే అసలు సిసలైన ట్రైలర్ రాబోతోందట. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ పై ఉన్న హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలంటే పవర్ ఫుల్ ట్రైలర్ రావాల్సిందే. ఇప్పటికే  ట్రైలర్ కట్‌ వర్క్ జరుగుతోందట. అయితే  డిసెంబర్ 27న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకున్నారు కానీ ఎందుకనో వాయిదా వేశారు. కాగా డిసెంబర్ 30న హైదరాబాద్ వేదికగా ఈవెంట్ ఉండొచ్చు అని యూనిట్ టాక్. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇక జనవరి మొదటి వారంలో ఏపిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రియల్ గేమ్ ఛేంజర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు టాక్ ఉంది. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.