స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాడు. తన అభిమానులు ఆందోళన పడకుండా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు స్టార్ కపుల్ ఉపాసన, రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చరణ్, ఉపాసన కలిసి బన్నీ కోసం ఓ స్పెషల్ కిట్ ను పంపించారు. ‘డియర్ బన్నీ మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు కలుద్దాం. ప్రేమతో చరణ్’ అంటూ ఆ కిట్ పై రాశారు. ఇక అల్లు అర్జున్ కూడా చరణ్, ఉపాసన కురిపించిన ప్రేమకు ఎమోషనల్ అవుతూ థాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయానికి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ కు రామ్ చరణ్, ఉపాసన సర్ప్రైజ్
