సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్‌లు తరచూ బ్రాండెడ్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే అందరూ ఇలాంటి యాడ్‌లకు అంతలా ఆసక్తి చూపించరన్నదానికి పవన్ కళ్యాణ్ ఉత్తమ ఉదాహరణ. ఇప్పటివరకు ఆయన ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. కారణం? ఆ ప్రకటనల వెనుక ఉండే ఉద్దేశ్యాలు, వాటి నిజమైన విలువలపై ఆయనకు నమ్మకం లేకపోవడమే. అలాగే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ భారీ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..
ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రామ్ చరణ్‌కు యాడ్ కోసం ఏకంగా రూ.15 కోట్లు ఆఫర్ చేసినా కూడా, ఆయన అంగీకరించలేదట. ఇంతకి ఆ యాడ్ ప్రాడక్ట్ ఏంటీ? అంటే.. అది చిన్న పిల్లలకు హానికరమైన కెమికల్స్ ఉండే ఉత్పత్తి. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే ‘నో’ అని స్పష్టంగా తిరస్కరించాడట. ఇటువంటి ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా తన ఫ్యామిలీ ఇమేజ్‌కు భంగం కలుగుతుంది.. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం నాకు ముఖ్యం అని భావించిన ఆయన సింపుల్ గా నో చెప్పేశారట.
అయితే ఆమధ్య ఇదే బ్రాండ్‌ను ఒక టాప్ సెలబ్రిటీ ప్రమోట్ చేయగా.. తర్వాత దాని కారణంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయాలన్నీ గమనించిన రామ్ చరణ్ ముందుగానే జాగ్రత్తగా ఉండాలనుకున్నారట. అందుకే అతనికి బంపర్ డీల్ వచ్చినా నిరాకరించాడన్న మాట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ అంశం పై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.. ‘ఇదే నిజమైన స్టార్ విలువ’, “పైసా కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్నదీ రామ్ చరణ్ క్లాస్” అంటూ మెగా అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.
