NTV Telugu Site icon

Ram Charan : కడప దర్గాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

Ram

Ram

కడప దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కడప అమీన్ పీర్ దర్గా ( పెద్ద దర్గా) నవంబర్ 16 నుండి 21 వరకు జరిగే పెద్ద ఉరుసు ఉత్సవాలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు పీర్ దర్గా పీఠాధిపతి “ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని”. అందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ముస్లింల మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా  కడప అమీన్ పీర్ దర్గాను భావిస్తారు.

Also Read : Matka : వరుణ్ తేజ్ మట్కా ఓవర్శీస్ టాక్.. ట్విట్టర్ రివ్యూ.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. కానీ చిత్ర ప్రమోషన్స్ కు కాస్త గ్యాప్ ఇచ్చి కడప దర్గా ఉరుసు ఉత్సవాలకు వస్తానని తెలియజేసారట రామ్ చరణ్. ఈ నేపథ్యంలో కడప దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్‌ ముషాయరా గజల్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నారు. ఈ నెల 18న అనగా సోమవారం ఈ వేడుకకు చరణ్ హాజరుకానున్నారు. రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాల దారణలో ఉన్నారు. దీక్షలో ఉండగానే వస్తారా లేదా ఆలోగా దీక్ష ముగుస్తోందా అన్నది క్లారిటీ లేదు. కడపలోని అమీన్ పీర్ దర్గా ఎంతో విశిష్టిత కలిగినది. ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్, నందమూరి కళ్యాణ్ రామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా ఎందరో ప్రముఖులు కడప దర్గాను దర్శించుకున్నారు.

Show comments