గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్‌ల్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. భారీ బడ్జెట్‌తో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా చరణ్ లుక్ అధిరిపోయింది. అయితే మొదట చరణ్ లుక్ పుష్పలో అల్లు అర్జున్‌లా ఉందని, కేజీఎఫ్‌లో యశ్‌లా ఉందని విమర్శించారు. కానీ శ్రీరామనవమి రోజున విడుదల చేసిన నిమిషం నిడివి ఉన్న గ్లింప్స్ వాటన్నింటినీ పటాపంచలు చేసింది.
Also Read: Puri Jagannadh : పూరి-విజయ్ సినిమాలో నిహారిక..?
రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్.. ముఖ్యంగా చివర్లో ఆయన కొట్టిన షాట్ విధానం మెగా ఫ్యాన్స్‌తోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్‌తోనూ చప్పట్లు కొట్టించింది. ఈ గ్లింప్స్‌తో ‘పెద్ది’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం లండన్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ‘ ‘పెద్ది’ మూవీ షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది.. ఈ సినిమా ‘రంగస్థలం’ చిత్రానికంటే కూడా బాగుంటుంది’ అని చరణ్ తెలిపారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
