Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్ర రిలీజ్ తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్‌లో చిత్ర సమర్పకులు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 4న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన క్లైమాక్స్ చూసినప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు పెద్ది కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. అలాంటి బ్యాలెన్స్ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. పెద్ది లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్ పై సాంగ్స్ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్‌లో అనిపించింది.
రత్నవేలు గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. చరణ్‌ని అద్భుతంగా చూపించినందుకు థాంక్యూ. మొన్న వచ్చిన టీజర్ విజువల్స్ మామూలుగా లేవు. సతీష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన మొదటి సినిమాకే రామ్ చరణ్ లాంటి హీరో, బుచ్చిబాబు లాంటి దర్శకుడు దొరకడం ఆయన అదృష్టం. చరణ్ డాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదు.. అంత అద్భుతమైన ఎనర్జీతో డాన్స్ చేశాడు. ‘పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం ను దాటి నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. బుచ్చిబాబు, సతీష్ గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌కు థాంక్యూ. ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా థాంక్యూ.
జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. హిందీలో జియో వారు విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా భారీ రిలీజ్ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.
