PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్‌కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PEDDI Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ రోజు చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. పెద్ది ట్రైలర్‌పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వృద్ధి సినిమాస్ పతాకంపై మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో కలిసి ఉన్న నిర్మాత సతీష్ కిలారు ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
ఈ బర్త్‌డే పోస్టర్‌తో పాటు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ అప్డేట్ను కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మే 18, 2026 (ఈరోజు) మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని ప్రముఖ ‘జియో వరల్డ్ డ్రైవ్’ వేదికగా గ్రాండ్‌గా ‘ట్రైలర్ టేక్ఓవర్’ (#PEDDITrailer Takeover) ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకతో సినిమా ప్రచార పర్వాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. క్రికెట్, సాంప్రదాయ కుస్తీ (రెజ్లింగ్) వంటి క్రీడల నేపథ్యంలో సాగే ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా ఇదని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Also Read
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ పాన్ – ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది (జూన్ 3న ప్రీమియర్ షోలు). నేడు విడుదల కానున్న ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పీక్స్‌కు చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Wishing the happiest birthday to the driving force behind it all ❤️🔥
Our Producer @VenkataSKilaru garu#PEDDITrailer Takeover event TODAY at JIO WORLD DRIVE, Mumbai 3 PM Onwards ❤️🔥#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/Hp3abQzvTQ— PEDDI (@PeddiMovieOffl) May 18, 2026
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?