Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” టీం రెడీ…!

Ram Charan, NTR is ready for an epic song shooting in RRR

కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా తమ సినిమాల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” టీం కూడా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ భారీ సాంగ్ చిత్రీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పాట సుమారు 8 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. హీరోలపై చిత్రీకరణ అనంతరం ఈ సాంగ్ కు భారీ గ్రాఫిక్స్ తో పాటు భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందట. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాటను ఇద్దరు హీరోలపై చిత్రీకరించడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. ఇప్పుడు రాజమౌళి ఆలోచన మేరకు ఆర్టిస్టులు స్టోరీబోర్డ్ తయారు చేశారు. వాటిని విఎఫ్ ఎక్స్ నిపుణులు రూపకల్పన చేయాల్సి ఉందట.

Also Read : ఉత్కంఠభరితంగా “కోల్డ్ కేస్” టీజర్

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో “ఆర్ఆర్ఆర్” ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కు ఇప్పటికే అడ్డంకులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో 2021 అక్టోబర్ 13 న సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ ఆలస్యం కానుందని అంటున్నారు.

Exit mobile version