మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్ కోసం మైసూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న తన అమ్మమ్మ అల్లు కనక రత్నం మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన, మళ్లీ మైసూర్ షూటింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూట్ మైసూర్‌లోని ఒక ప్రాంతంలో జరుగుతోంది. అయితే, తాజాగా రామ్ చరణ్ తేజ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్వతహాగా మైసూరు ప్రాంతానికి చెందిన సిద్ధరామయ్య, అధికారిక పర్యటన కోసం మైసూరు వెళ్లారు.
Also Read:Anushka: శీలావతిగా అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం
మూడు రోజులపాటు ఆయన మైసూర్‌లోనే ఉండనున్నారు. ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో సిద్దరామయ్య రామ్ చరణ్ ను ఆత్మీయంగా సత్కరించారు. ఇక, ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా, అంచనాలను పెంచేలా ఇప్పటినుంచే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇక, సిద్ధరామయ్య ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆయన, కర్ణాటక ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
