Site icon NTV Telugu

‘ఆర్​ఆర్​ఆర్’ సెట్​లో చరణ్​.. స్టిల్స్ వైరల్

లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన చిత్రీకరణలు.. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌ కూడా ఇటీవల మొదలైంది. ప్రస్తుతం రామ్​చరణ్..​ ఎన్టీఆర్​ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే వీరిద్దరిపై పాటను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా షూటింగ్​ సెట్​లోని రామ్​చరణ్​ ఫొటోలు వైరల్​గా మారాయి. చరణ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version