NTV Telugu Site icon

Ram Charan RC 16: బీస్ట్ మోడ్ ఆన్.. చరణ్ ఆన్ ఫైర్

Ram Charan Shivoham

Ram Charan Shivoham

Ram Charan in Beast Mode for RC16: గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఆస్ట్రేలియా వెళ్లి బాడీ బిల్డ్ చేసే పనిలో పడ్డట్టుగా కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ తేజ అథ్లెటిక్ లుక్ లో కనిపించాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ సినిమాల కోసం బిల్డ్ చేసిన బాడీ వేరేగా ఉండటంతో ఇప్పుడు అథ్లెటిక్ లుక్కు కోసం రామ్ చరణ్ తేజ కష్టపడుతున్నాడు.

Jani Master : పరారీలో జానీ మాస్టర్.. బాధిత మహిళ కూడా? ఏ క్షణమైనా అరెస్ట్??

ఇక తాజాగా రామ్ చరణ్ తేజ తాను బీస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ బ్లాక్ కలర్ టీ షర్ట్ షార్ట్స్ ధరించి కనిపిస్తుండగా ఎదురుగా సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ శివోహం కనిపిస్తున్నారు. అంటే శివోహం ఆధ్వర్యంలో రామ్ చరణ్ తేజ తన బాడీ షేప్ చేయించుకుంటున్నారు. ఇక శివోహం అమితాబచ్చన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ లాంటి వాళ్లకు బాడీ షేపింగ్ చేయించి, ఫిట్ నెస్ కోచ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాంచరణ్ తేజ, బుచ్చిబాబు సినిమాకి పెద్ది అనే టైటిల్ పరిశీలన ఉంది, ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Show comments