Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?

Game Changer

Game Changer

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజ‌ర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చ‌ర‌ణ్ కావ‌టం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ వంటి మెట్రో సిటీల్లో టీజ‌ర్ లాంచ్ కావ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌య‌మే కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’ టీజ‌ర్‌ను ల‌క్నో విడుద‌ల చేస్తూ నిజంగానే టైటిల్‌కు త‌గ్గ‌ట్టు గేమ్‌ను చేంజ్ చేశారు. భారీ అంచ‌నాలున్న గేమ్ చేంజ‌ర్ టీజ‌ర్ ఈవెంట్‌ గ్రాండ్ గా జరుగుతోంది. ఇదిలా ఉండగా సైలెంటుగా టీజర్ వదిలారు. అది ఎలా ఉందో ఇప్పుడు చూసేయండి.
YouTube video player