Site icon NTV Telugu

Shubam : సమంత ‘శుభం’పై చరణ్ ట్వీట్

Samantha Charan

Samantha Charan

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత, అనారోగ్యం కారణంగా కాస్త నెమ్మదించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తుందనుకుంటే, నటనకు విరామం ఇచ్చి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. తాజాగా, ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. క్రిటిక్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తుండగా, ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నిరాశ చెందుతున్నారు.

Read More:Crime: 10 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లవర్..

అయినప్పటికీ, సమంతకు సెలబ్రిటీల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. తాజాగా, ఆమె సినిమా గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. “‘శుభం’ గురించి కుటుంబాల నుంచి మంచి విషయాలు వింటున్నాను. ట్రైలర్ చూస్తే చాలా ఫన్‌గా అనిపిస్తోంది. ఈ సినిమాను నా కుటుంబంతో కలిసి చూడడానికి ఏమాత్రం ఆగలేకపోతున్నాను. ఇలాంటి యూనిక్, రిఫ్రెషింగ్ సినిమాలను మనం తప్పక ప్రోత్సహించాలి. సమంతకు నా బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్‌గా ఇలాంటి కిక్‌స్టార్ట్ అందరికీ దక్కదు. టీమ్ అందరికీ కంగ్రాట్స్,” అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సమంత కూడా స్పందించింది. రామ్ చరణ్ తన సినిమాకు శుభాకాంక్షలు తెలపడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె ట్వీట్ చేసింది.

Exit mobile version