Site icon NTV Telugu

Rakul : లైఫ్ లో ఎంత బిజీగా ఉంటే.. అంత ప్రశాంతంగా ఉంటా

Rakul Prithisingh

Rakul Prithisingh

తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మధ్యలో కొంత అవకాశాలు తగ్గినప్పటికీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఇటీవల ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ తో పలకరించగా. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దే డే ప్యార్ దే 2’లో నటిస్తోంది. అలాగే నితేశ్ తివారీ దర్శకత్వంలో రానున్న రామయణలోనూ ఆమె శూర్పణఖ‌గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా భాషతో సంబంధం లేకుండా తమిళ, హిందీ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

Also Read: Happy Birthday Allu Arjun: హీరో మేటీరియలే కాదన్నారు.. కట్‌చేస్తే ‘పుష్ప’తో ప్రభంజనం సృష్టించాడు!

‘ఇండస్ట్రీ ఏదైనప్పటికి జయాపజయాలు సహజం. అవి జీవితంలో భాగమే. కెరీర్‌ల్లో స్థిరపడే కొద్దీ మార్పులు వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం మాత్రం కోల్పోకూడదు. తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలి. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నా విషయంలో.. నేను ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాను. వరుస షూటింగ్ షెడ్యూల్ ఉన్నప్పుడు నాకు ఒత్తిడిగా అనిపించదు. కానీ షూటింగ్స్ లేనప్పుడు కాలీగా ఉంటేనే తీవ్ర ఒత్తిడికి గురవుతాను. ప్రతిరోజూ వర్కు వెళ్లడం, కెమెరాను ఎదుర్కోవడం నా జీవితంలో భాగమయ్యాయి. ఈ దినచర్య నన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఎప్పటికీ నా జీవితం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

Exit mobile version