NTV Telugu Site icon

Rakul Preet Singh: తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రకుల్

Rakul (2)

Rakul (2)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒకప్పుడు చక్రం తిప్పింది రకుల్ ప్రీత్ సింగ్. బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది. ఇక హీరోయిన్‌లకు ఇండస్ట్రీలో పోటి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మర్చింది రకుల్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికి అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే..

గత ఏడాది ఆమె.. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహంతో ఒకటైన ఈ జంట ఇటీవల తమ మొదటి పెళ్లిరోజు పూర్తి చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ రకుల్ షూటింగ్ సమయంలో తన భర్తను మిస్ అవుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టా లో ఒక ఒక పోస్ట్ పెట్టింది.. ‘సినిమా షూటింగ్ సమయంలో మా ఆయనను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అతనికి దగ్గరగా ఉన్న ఫీల్ రావడం కోసం.. ఆయన బట్టలు వేసుకుంటున్నా. అప్పుడు నాకు ఆయన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది ’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక రకుల్ మాటలపై ఫ్యాన్స్ కెరీర్ కోసం తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.