NTV Telugu Site icon

Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్

Rakulpreetsinghbrotherarres

Rakulpreetsinghbrotherarres

Rakul Preet Singh Brother Amanpreet Singh Arrested While Purchasing Drugs: హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ని పోలీసులు బట్టబయలు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర సుమారు 200 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్వోటీ పోలీసులు, రాజేంద్రనగర్ డివిజన్ పోలీసులు మొత్తంగా మూడు పోలీస్ టీమ్స్ కలిసి చేసిన ఉమ్మడి ఆపరేషన్ లో భాగంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నైజీరియన్లను అరెస్టు చేశారు. పలువురు విఐపిలకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. ఐదుగురు నైజీరియన్ ల వద్ద కొకైన్ కొనుగోలు చేసిన ఐదుగురు వీఐపీలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Shankar: భారతీయుడు 2 అయిపొయింది.. గేమ్ ఛేంజర్ కోసం హైదరాబాదుకి శంకర్

అలా అరెస్ట్ కాబడిన ఐదుగురిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు అని చెబుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అమన్ ప్రీత్ సింగ్ ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ జాయింట్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. పోలీసులు ఈ మేరకు సోదాలు జరుపుతున్నారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకి వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక 200 కోట్ల కొకైన్ విలువ కొన్ని కోట్లు ఉంటుందని అంటున్నారు.

Show comments